10 August, 2026 | 9:54 PM

బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసన

10-08-2026 08:49 PM

నాయకులు అరెస్టు పోలీస్ స్టేషన్ కు తరలింపు,

పెద్ద ఎత్తున తరలివచ్చిన కార్మికులు,  జైల్ భరో కార్యక్రమం విజయవంతం

ఎర్రుపాలెం,(విజయక్రాంతి): కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సంఘటిత  పోరాటాలకు కార్మికులు కర్షకులు కూలీలు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జైల్ భరో కార్యక్రమానికి తరలివచ్చారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం రింగ్ సెంటర్ నందు గ్రామపంచాయతీ, అంగన్వాడి, మధ్యాహ్న భోజన కార్మికులు,ఆశ కార్యకర్తలు ఉపాధి హామీ కూలీలు, రైతులు సిఐటియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చి కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.

పోలీసులు జైల్ భరో కార్యక్రమాన్ని అడ్డుకొని అరెస్టు చేసి నాయకులను పోలీస్ స్టేషన్ కు తరలించారు. నాయకులను అరెస్టు చేసిన సందర్భంగా అన్ని సంఘాల కార్మికులు రింగ్ సెంటర్ వద్ద నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.ఈ కార్యక్రమం సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దివ్వెల వీరయ్య, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావులు మాట్లాడుతూ ఢిల్లీలో జంతర్ మంతర్  వద్ద యువత చేసిన ఉద్యమానికి,గతంలో నిర్వహించిన రైతాంగ పోరాటానికి మోడీ ప్రభుత్వం దిగివచ్చిందని దేశవ్యాప్తంగా జరుగుతున్న జైల్ భరో కార్యక్రమం ద్వారా మోడీ చేస్తున్న అరాచక పరిపాలన అంతం కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో  సిఐటియు కో కన్వీనర్ దూదిగం బసవయ్య, రైతు సంఘం మండల అధ్యక్షుడు కన్నేబోయిన శ్రీనివాసరావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు గామాస్ జోగయ్య, నాగులవంచ వెంకట రామయ్య, గ్రామ పంచాయతీ కార్మికుల మండల అధ్యక్ష కార్యదర్శులు గంతాల నాగేశ్వరావు నరేంద్ర,అంగన్వాడీ మండల అధ్యక్ష కార్యదర్శులు కోమ్మినేని మాధవి, కృష్ణకుమారి,నాయకులు ఆశల మండల అధ్యక్ష కార్యదర్శులు నoడ్రు సుధారాణి, ఏసుమణీ,షేక్ లాల,ఆంగోతు , నక్క పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.