6 June, 2026 | 6:01 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

ఒక రివ్యూ చాలా బాధించింది

11-10-2024 12:00 AM

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను తన తొలి సినిమాలో ఎదుర్కొన్న విమర్శలను గుర్తు చేసుకున్నారు. అందులో ఆమె మాట తీరు చూసి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయట. అయితే ఆ సినిమాలో దీపిక పాత్రకు వేరొక నటి డబ్బింగ్ చెప్పారు. అయితే అది సెట్ అవకపోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై దీపిక స్పందించారు.

దీపిక నటించిన తొలి బాలీవుడ్ చిత్రం ‘ఓం శాంతి ఓం’. ఈ సినిమా విడుదలైనప్పుడు రివ్యూలు కొన్ని నెగిటివ్‌గా వచ్చాయని, వాటిలో ఒక రివ్యూ తనను చాలా బాధించిందని దీపిక తెలిపారు. అయితే ఒక్కోసారి నెగిటివ్ రివ్యూలు కూడా మనకి మం చి చేస్తాయని, వాటిని తీసుకునే విధానం లో ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దీపిక నటించిన ‘సింగం అగైన్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.