calender_icon.png 28 January, 2026 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ పేరిట అక్రమ రవాణా

28-01-2026 12:51:01 AM

ఆన్‌లైన్ ఉన్న ప్రాంతానికి తరలింపు

అధికారుల అండతోనేనా..?

మంచిర్యాల, జనవరి 27 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ఇందిరమ్మ ఇంటికి వెళ్లాల్సిన ఇసుక అక్రమార్కు లు బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా అధికార యంత్రాంగం కనుసన్నులలోనే జరుగుతుందా..! అంటే అవుననే సమాధానం వస్తుంది... ఆన్‌లైన్ ద్వారా బుక్ అయిన ఇసుక వాహనాలను మైనింగ్ శాఖ సిబ్బంది ఫొటో తీసుకొని పంపిస్తుంటారు.

అలాగే రెవెన్యూ సిబ్బంది సైతం ఒకరు ఇసుక రీచ్ వద్ద కూర్చొని రోజుకు ఏ ట్రాక్టర్ ఎన్ని ట్రిప్పుల ఇసుక తీసుకెళుతుంది, ఎవరి పేరిట మంజూరైన ఇందిర మ్మ ఇంటికి ఎన్ని ట్రిప్పులు వెళుతున్నాయో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అది జరుగడం లేదనేది స్పష్టమవుతుంది. కేవ లం ఆమ్యామ్యాలు తీసుకుంటూ ఒక చీటి ఇచ్చి రెండు నుంచి మూడు ట్రిప్పులకు అనుమతులు ఇస్తున్నట్లు తెలియవచ్చింది.

ఆన్‌లైన్ బుకింగ్ ప్రాంతాలే టార్గెట్..

ఒక ప్రాంతం నుంచి ఇసుకకు ఎక్కువ బుకింగ్ లు వస్తే అటు వైపు ఆన్ లైన్ ట్రాక్టర్లు నడుస్తుండటం సర్వ సాధారణంగా జరిగే ప్రక్రియ. ఇదే అదనుగా ఇందిరమ్మ ఇంటికి ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్లు లబ్దిదారులకు కాకుండా ప్రైవేటుగా అమ్ముకుంటున్నారు. సాధారణంగా ఇందిర మ్మ ఇంటి నిర్మాణం కోసం మొదటి విడతలో 12 ట్రిప్పు లు, రెండవ విడతలో నాలుగు, మూడవ విడతలో నాలు గు ట్రిప్పులకు రెవెన్యూ అధికారులు అనుమతులిచ్చారు. ఇలా ఒక ఇంటికి 20 ట్రిప్పులకు అనుమతులను రెవెన్యూ అధికారుల అండదండలతో రెట్టింపు ట్రిప్పు ల ఇసుకను బహిరంగా మార్కెట్‌లో అమ్ముకుంటున్నారు. మరి కొంతమంది ట్రాక్టర్ యజ మానులైతే ఇసుకను డంపులు డంపులుగా నిలువ చేసుకుంటున్నారు. అసలు విషయమేంటంటే లబ్ధిదా రుడికి కనీసం ఒక ట్రిప్పయినా పోతుందా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

రీచ్ నుంచి వెళ్లేంత వరకే తమ బాధ్యత...

ఇసుక రీచ్ నుంచి వాహనం వెళ్లేంతవరకే మా బాధ్యత ఉంటుందని, తర్వాత అది ఇందిరమ్మ ఇంటికి వెళ్లిందా..! పక్కదారి పట్టిందా..? అనేది మాకు సంబంధం లేదని రెవెన్యూ అధికారులు బాహాటంగానే మాట్లాడుతున్నారు. అధికారుల సఫోర్టుతోనే ఈ ఇసుక అక్రమ దందా జోరు గా కొనసాగుతుందనే ఆరోపణలకు రెవెన్యూ అధికారుల సమాధానాలు ఆజ్యం పోస్తున్నాయనడంలో ఎలాంటి సందేహాం లేదు. రీచ్ నుంచి బయటకు వచ్చిన ఇసుక ట్రాక్టర్ ఎక్కడికి వెళ్లింది, ఏ ఇందిరమ్మ ఇంటికి వెళ్లింది, ఎన్ని ట్రిప్పులు వారికి చేరిందనే దానిపై పట్టింపులేని తనం వల్లనే ఎవరికి వెళుతుందో, అది ఎక్కడ అమ్ముకుంటున్నారో తెలియడం లేదు.