24-02-2026 12:00:00 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): సంచలనం సృష్టించిన సృష్టి ఆసుపత్రి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సరోగసి అద్దెగర్భం పేరుతో భా రీగా అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ నమ్రతను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. రెండు రోజుల పా టు ఆమెను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు నాంపల్లిలోని ఈడీ కోర్టు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఐదు రోజులు కోరితే..
సరోగసి పేరుతో జరిగిన అక్రమాల కేసు లో ఇప్పటికే డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు, జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. ఈ క్రమంలో ఆమెను మరిం త లోతుగా విచారించేందుకు నాంపల్లి కోర్టు లో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి.
నమ్రతను విచారించేందుకు ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా.. కేవలం రెండు రోజులు మాత్రమే న్యాయస్థానం అనుమతించింది. దీంతో మంగళవారం ఉదయం 10 గంటల నుంచి బుధవారం సా యంత్రం 5 గంటల వరకు ఆమెను ఈడీ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ రెండు రోజుల పాటు ఆమెను నిశితంగా ప్రశ్నించి, వాంగ్మూలాన్ని స్టేట్‌మెంట్ రికార్డ్ చేయనున్నారు.
హవాలా, మనీ లాండరింగ్‌పై ఆరా..
సరోగసి పేరుతో డాక్టర్ నమ్రత భారీగా డబ్బులు వసూలు చేశారని, ఆ నిధులను హవాలా మార్గంలో విదేశాలకు తరలించారనే మనీ లాండరింగ్ తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మొదట సీసీఎస్ పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసిన కీలక అంశాలు, నివేదికల ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ.. ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది.
ఈ రెండు రోజుల విచారణలో న మ్రత నుంచి హవాలా లావాదేవీలు, మనీ లాండరింగ్ కు సంబంధించిన కీలక విషయాలను రాబట్టే అవకాశం ఉంది. ఈ విచారణలో వెల్లడయ్యే అం శాల ఆధారంగా, ఒకవేళ మరింత స మాచారం అవసరమైతే మరోసారి కస్టడీని పొడిగిం చాలని ఈడీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.