24-02-2026 12:00:00 AM
పెబ్బేరు, పిబ్రవరి 23: మున్సిపల్ పట్టణ కేంద్రం 7 వ వార్డులోనీ శ్రీ నిత్య నిర్మలచల రాజయోగ ఆశ్రమంలో ఆశ్రమ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మున్సిపల్ నూతన చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లును ఆశ్రమ కమిటీ అధ్యక్షులు మోతే రాముడు, సహోదరులు, భక్త బృందం శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పెబ్బేరు పట్టణంలో 1992 నుండి నిత్యనిర్మలచల రాజయోగ ఆశ్రమం నడపబడుతున్నది.
ఇట్టి కార్యక్రమానికి వేలాదిగా భక్తులు రావడం తో పాటు కమిటీ ఆధ్వర్యంలో అన్నదానాలు, భజనలు, ఆధ్యాత్మిక సేవలు అభినందించదగ్గవని, వారి సేవలను ప్రశంసించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో వారితోపాటు హిందూ ఆధ్యాత్మిక, ధార్మిక సేవలో సభ్యునిగా ఉంటూ తాను కూడా పాల్గొన్నట్లుగా, ఇకముందు కూడ సానుకూలంగా మా వంతు సహకారం ఎల్లప్పుడూ అందుతుందని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మోతే వారి కుటుంబ సభ్యులు, ఆశ్రమ భక్త బృందం, పలువురు మహిళలు తదితరులు పాల్గొన్నారు.