3 July, 2026 | 1:07 AM

టీజీయూజీసీ అఫైర్స్ డైరెక్టర్‌గా డా.పాత నాగరాజు నియామకం

03-07-2026 12:00 AM

కామారెడ్డి, జూలై 2 (విజయక్రాంతి): తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరిరావు ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి అర్థశాస్త్ర విభాగానికి చెందిన సహ ఆచార్యులు,మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ పాత నాగరాజుకు యుజిసి అఫైర్స్ డైరెక్టర్‌గా గురువారం ఉత్తర్వులు అందజేశారు.

డాక్టర్ పాత నాగరాజు గతంలో అర్థశాస్త్ర విభాగాధిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘ అధ్యక్షులుగా,ప్రిన్సిపల్ గా, ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్ సెల్ డైరెక్టర్ గా,కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ గా సుదీర్ఘకాలం  బాధ్యతలు నిర్వహించారు. యుజిసి అఫైర్స్ డైరెక్టర్ గా నియామకమైన డాక్టర్ పాత నాగరాజుకు టీఎన్‌ఎస్‌ఎఫ్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు శుభాకాంక్షలు తెలిపారు.