ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి
03-07-2026 12:00 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
కొత్తకోట, జూలై 2: పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తకోట ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను వెంటనే గ్రౌండింగ్ చేసి పనులు ప్రారంభించాలని, గుడిసెల్లో నివసించే అర్హులకే కొత్త ఇళ్ల మంజూరులో తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే రైతులు దొడ్డు, ధాన్ రకం వరి సాగు చేయకుండా అవగాహన కల్పించి, సన్న రకం వరి సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులకు ఆదేశించారు.






