3 July, 2026 | 1:01 AM

ఫిర్యాదుదారుడికి సత్వర న్యాయం జరగాలి

03-07-2026 12:00 AM

ఎస్పీ సంగ్రామ్ సింగ్

కల్వకుర్తి, జూలై 2: పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి సత్వర న్యాయం జరిగేలా చర్య లు తీసుకోవాలని ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సూచించారు. గురువారం కల్వకుర్తి పోలీ స్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, బాధితుల ఫిర్యాదులపై వెంటనే స్పందించి పారదర్శకంగా విచారణ చేపట్టాలని ఆదేశించారు.

డయల్-112 అత్యవసర కాల్స్కు వెంటనే స్పందించాలని, రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్లు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఈ తనిఖీలో డీఎస్పీ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.