4 August, 2026 | 1:51 AM

డ్రైనేజ్, తాగునీటి సమస్యలు తీర్చాలి

04-08-2026 12:15 AM

జలమండలి సీజీఎంకు వినతి

నాగోల్, ఆగస్టు 3(విజయక్రాంతి): కొత్తపేట డివిజన్లో డ్రైనేజ్, తాగునీటి సమస్య లను పరిష్కరించాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్ జలమండలి సీజీఎం నాగేందర్కు వినతిపత్రం అందజేశారు. హయత్నగర్ జలమండలి కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో ఆయన పాల్గొన్నారు.

జైన్ మందిర్ లైన్, నాగేశ్వరరావు కాలనీ, మారుతి నగర్, సత్యనగర్, గాయత్రిపురం ప్రాంతాల్లో దశాబ్దాల నాటి పాత డ్రైనేజ్ పైప్లైన్ల స్థానంలో కొత్తవి వేయాలని కోరారు. అలాగే కమర్షియల్ టాక్స్ కాలనీ, ఆర్బీఐ కాలనీలలో లో-ప్రెషర్ సమస్యను సరిచేయాలని, న్యూ మారుతి నగర్లో 40 ఏళ్ల నాటి పాత పైప్లైన్ల వల్ల నీరు కలుషితమవుతున్నందున వెంటనే కొత్త తాగునీటి లైన్లు మంజూరు చేయాలని అధికారులను విజ్ఞప్తి చేశారు.