4 August, 2026 | 1:51 AM

దమ్మాయిగూడ సమస్యలపై కలెక్టర్‌కు వినతి

04-08-2026 12:17 AM

జవహర్‌నగర్, ఆగస్టు 3 (విజయక్రాంతి): దమ్మాయిగూడ డివిజన్లో నెలకొన్న ప్రధాన ప్రజా సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ నాయకులు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దమ్మాయి గూడనాగారం ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిన్నందున వెంటనే మరమ్మత్తులు చేపట్టి నూతన రహదారి నిర్మించాలని కోరారు.

అలాగే దమ్మాయిగూడలో ప్రభుత్వ స్మశాన వాటిక లేక ప్రజలు అంత్యక్రియల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తక్షణమే తగిన స్థలాన్ని కేటాయించి ప్రభుత్వ స్మశాన వాటికను ఏర్పాటు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ అధ్యక్షుడు తోట నరేష్ పటేల్, దమ్మాయిగూడ ఇంచార్జ్ సురేష్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొగరం వెంకన్న, జిల్లా ఆఫీస్ సెక్రటరీ గాలి సంపత్ యాదవ్, జిల్లా నాయకుడు రవీందర్ గౌడ్, ఐటీ సెల్ శేఖర్ చారి, జిల్లా జనరల్ సెక్రటరీ (మహిళా మోర్చా) సుజాత నాయక్, దమ్మాయిగూడ జనరల్ సెక్రటరీ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ ధర్మేందర్, సురేందర్ రెడ్డి, చక్రపాణి, రాయుడు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.