22 April, 2026 | 8:22 PM

వేసవిలో ప్రజల దాహం తీర్చేందుకే చలివేంద్రాల ఏర్పాటు

22-04-2026 07:11 PM

కారేపల్లి,విజయక్రాంతి): సింగరేణి మండలం అప్పాయిగూడెం గ్రామ పంచాయతీలో సర్పంచ్ దండు ప్రవీణ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభించారు. మండల పరిధిలో పెరుగుతున్న వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని గ్రామ ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి, గ్రామీణ జలవనరుల విభాగ అధికారులు, మండల పంచాయతీ అధికారి, సంబంధిత విభాగాల అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ... వేసవి కాలంలో ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సర్పంచ్ దండు ప్రవీణ్, కార్యదర్శి మరియు గ్రామ పంచాయతీ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.ఈ చలివేంద్రం ద్వారా గ్రామ ప్రజలకు తాగునీటి సమస్య కొంతవరకు తగ్గుతుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.కార్యదర్శి కృష్ణవేణి,మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు రంజిత్, ఉప సర్పంచ్ ఎట్టి సంధ్య రాణి,  ఇతర సర్పంచులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.