29 May, 2026 | 10:24 PM

గొల్లాపూర్ వాసుల గొంతు తడిసింది

29-05-2026 03:31 PM

బోథ్,మే 29 (విజయక్రాంతి): సోనాల మండలంలోని గొల్లాపూర్ గ్రామానికి నాలుగు రోజులపాటు నీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను విజయక్రాంతి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైంది. దీంతో అధికార యంత్రాంగం స్పందించి గ్రామంలోని బోరు బావులను మరమ్మత్తు చేయడంతో పాటు మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరందే విధంగా ఏర్పాటు చేశారు. ఇదే వార్త కథనాన్ని ప్రచురించిన విజయక్రాంతి కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.