29 May, 2026 | 10:25 PM

రైతులతో రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్

29-05-2026 03:32 PM

బోథ్,మే29(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సోనాల మండల కేంద్రంలో జొన్న పంట కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయించిందని అయితే కొంతమంది టిఆర్ఎస్ నాయకుల తో పాటు. మాజీ ఎంపీపీ రైతులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గాజుల పోతన్న పేర్కొన్నారు.

రైతుల ఇబ్బందులను స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్ జిల్లా ఇన్చార్జి మంత్రి  దృష్టికి తీసుకువెళ్లి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మరో రెండు రోజుల్లో కొనుగోలు ముగిసిపోయే సందర్భంలో విఆర్ఎస్ నాయకులు కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులతో రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. సంబంధిత అధికారులతో కలిసి తాము గన్ని బ్యాగులను తెప్పించడంతోపాటు గోదాములకు రవాణా చేసే లారీలను పద్ధతి ప్రకారం వెళ్లే విధంగా చూస్తున్నామన్నారు. రైతులు వీరి మాయమాటలు నమ్మవద్దని ఆయన పేర్కొన్నారు. బి ఆర్ ఎస్ నాయకుల తీరును తమ ఖండిస్తున్నామన్నారు.