06-11-2025 10:04:46 AM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్(Rajendranagar Police Station) పరిధిలో డ్రగ్స్ ముఠా అరెస్ట్(Drug gang arrested) అయింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు వినియోగదారులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఓటీ పోలీసులు వెల్లడించారు. బెంగళూరు నుంచి బస్సులో డ్రగ్స్ తీసుకోస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నునంచి 17 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ పరిధిలోనే మత్తు పదార్థాలు ఓ వ్యక్తి ప్రాణం తీశాయి. మితిమీరిన మత్తు పదార్థాలు సేవించి వ్యక్తి మృతి చెందాడు. డ్రగ్స్ డోస్ ఎక్కువ కావడంతో అలీ(28) వ్యక్తి మృతిచెందాడు. అలీ మొబైల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. రాత్రి స్నేహితులతో కలిసి డ్రగ్స్ సేవించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.