06-11-2025 11:26:28 AM
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులు( World Cup winning women's cricket team), ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ ను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi ) అభినందించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, ఇతర ప్లేయర్లతో ప్రధాని కొద్దిసేపు సంభాషించారు. భారత మహిళల జట్టు పుంజుకున్న తీరును నరేంద్ర మోదీ మెచ్చుకున్నారు. ప్రపంచకప్ లో జట్టు సభ్యులు పట్టిన అద్భుత క్యాచ్ లపై ప్రధాని చర్చించారు. మనోబలం, పట్టుదల, పోరాటాన్ని చూపెట్టారని మోదీ ప్రశంసించారు. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడారని జట్లు సభ్యులను ఆయన కొనియాడారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధిస్తామని జట్టు సభ్యులు వెల్లడించారు. జట్టు సభ్యులు ఒక్కొక్కరితో మాట్లాడి గెలుపు తీరును ప్రధాని తెలుసుకున్నారు. భారత మహిళా క్రికెట్ జట్టును కలిసిన ప్రధాని మోదీ వీడియో, ఫొటోలు సామాజిక మాద్యమాల్లో వైరల్ అవుతున్నాయి.