calender_icon.png 6 November, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా డీఎస్పీలు.. వచ్చే తరానికి ఆదర్శంగా నిలవాలి: డీజీపీ

06-11-2025 11:58:49 AM

హైదరాబాద్‌: గ్రూప్ వన్ ద్వారా ఎంపికైన డీఎస్పీలకు ట్రైనింగ్‌ కార్యక్రమాన్ని డీజీపీ శివధర్‌ రెడ్డి(DGP Shivdhar Reddy) గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ పాల్గొన్నారు. పోలీస్ అకాడమీలో మొత్తం 115 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. 115 మందితో ఇదే అతిపెద్ద డీఎస్పీ బ్యాచ్ అని డీజీపీ తెలిపారు. 10 నెలలు శిక్షణ కాలం చాలా కష్టంగా ఉంటుందని సూచించారు. పోలీస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల హృదయాలు గెలవాలని పిలుపునిచ్చారు. మహిళా డీఎస్పీలు వచ్చే తరాలని ఆదర్శంగా నిలవాలని డీజీపీ శివధర్‌ రెడ్డి పేర్కొన్నారు.