calender_icon.png 6 November, 2025 | 1:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం పోలింగ్

06-11-2025 10:25:39 AM

పాట్నా: బీహార్‌లోని 121 అసెంబ్లీ స్థానాలకు గురువారం ఉదయం తొలి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమై కొనసాగుతోంది. బీహార్ తొలి దశ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 13.13 శాతం పోలింగ్(Bihar first phase voting percentage) నమోదైంది. మొదటి దశ పోలింగ్ ప్రారంభమైన మొదటి రెండు గంటల్లో 3.75 కోట్ల మంది ఓటర్లలో మొత్తం 13.13 శాతం(Bihar Election 2025 Phase 1 voting) మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. సహర్సాలో ఇప్పటివరకు అత్యధిక పోలింగ్ శాతం 15.27గా నమోదైంది. ఆ తర్వాత బెగుసరాయ్ (14.6), ముజఫర్‌పూర్ (14.38)శాతంగా నమోదైంది.   ఆర్జేడీ నాయకుడు, ఇండియా బ్లాక్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్, కేంద్ర మంత్రులు గిరిరాజ్ సింగ్, రాజీవ్ రంజన్ సింగ్ 'లాలన్', బీహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా సహా పలువురు సీనియర్ రాజకీయ నాయకులు ముందుగా ఓటు వేసిన వారిలో ఉన్నారు.  

ఈ దశ రెండు కూటములకు, బీజేపీ, జేడీ(యు) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (National Democratic Alliance), ఆర్జేడీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి (Mahagathbandhan)లకు చాలా కీలకం. ఈ రౌండ్ ఫలితం తేజస్వి యాదవ్(Tejaswi Yadav), ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా వంటి అగ్ర నాయకుల విజయావకాశాలను నిర్ణయిస్తుంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో, ఈ దశలో పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో దాదాపు 54.3శాతం పోలింగ్ నమోదైంది. ఆర్జేడీ 42 సీట్లు, బీజేపీ 32, జేడీ(యు) 23, కాంగ్రెస్ 8, వామపక్షాలు 11 సీట్లు గెలుచుకున్నాయి.  ఈసారి కూడా ఇదే విధంగా లేదా కొంచెం ఎక్కువగా పోలింగ్ జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు, ముందస్తు నివేదికలు పట్టణ, సెమీ అర్బన్ ప్రాంతాలలో చురుకైన పోలింగ్ జరుగుతుందని సూచిస్తున్నాయి. మిగిలిన రెండు దశల పోలింగ్ నవంబర్ 11, 17 తేదీలలో జరుగుతుంది, నవంబర్ 14న ఫలితాలు వెల్లడికానున్నాయి.