calender_icon.png 6 May, 2025 | 8:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాచిగూడలో డ్రగ్స్ పెడ్లర్ అరెస్ట్..

24-03-2025 11:47:23 PM

నైజీరియన్‌ను అరెస్ట్ చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ కలకలం రేపింది. ముంబై నుంచి కొకైన్‌ను తీసుకొచ్చి హైదరాబాద్‌లో అమ్మేందుకు ప్రయత్నించిన నైజీరియాకు చెందిన ఎడ్విన్ అనే ఓ డ్రగ్స్ పెడ్లర్‌ను విశ్వసనీయ సమాచారం మేరకు హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 7 గ్రాముల కొకైన్, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.