calender_icon.png 6 May, 2025 | 11:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేసు కుక్కల దాడిలో 18 గొర్రెలు మృతి

25-03-2025 12:00:00 AM

కామారెడ్డి జిల్లా వేలుట్ల పేటలో ఘటన

ఎల్లారెడ్డి, మార్చి 24 (విజయ క్రాంతి): రేస్ కుక్కల దాడిలో 18 గొర్రె లు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల పేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెళ్ళుట్ల పేటకు చెందిన కొరి నారాయణ తన మేకలను మేపడానికి సోమవారం ఉదయం గొర్రెలతో గ్రామ శివారుకు వెళ్లాడు.

గ్రామానికి చెందిన కర్రే సాయన్న కట్టు కాల్వ వద్ద గొర్రెలు మేస్తుండగా అటవీ ప్రాంతం నుంచి గుంపుగా వచ్చిన రేస్ కుక్కలు గొర్రెల మంద పై పడి కొరికి చంపాయి. ఈ ఘటనలో 18 గొర్రెల మృతి చెందినట్లు బాధితులు వాపోయారు. 18 గొర్రెల విలువ రెండు లక్షల వరకు ఉంటుందని నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని బాధితుడు కోరారు.