26 April, 2026 | 7:26 AM

ఆలె నరేంద్ర దారిలోనే మాధవీలత

11-05-2024 02:07 AM

మజ్లిస్‌కు గట్టి పోటీ ఇస్తున్న బీజేపీ నేత

చార్మినార్, మే 10 (విజయక్రాంతి): హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 1984 నుంచి మజ్లిస్ హవానే కొనసాగుతోంది. అప్పటినుంచి ఆ స్థానంలో ఎంఐఎం మినహా ఏ పార్టీ నిలదొక్కుకోలేదు. ఒక బీజేపీ మినహా కనీసం గట్టి పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. అందుకు కారణం ఆ పార్టీకి చెందిన నేత, ప్రజలు టైగర్‌గా పిలుచుకునే ఆలె నరేంద్ర. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఒవైసీని ప్రతి ఎన్నికల్లో నరేంద్ర దీటుగా ఎదుర్కొన్నారు.

అయితే హైదరాబాద్ స్థానంలో గెలవలేకపోయారు. ఆయన మరణం తర్వాత మజ్లిస్‌కు పోటీయే లేకుండా పోయింది. ఇప్పుడు నరేంద్ర స్థాయిలోనే హైదరాబాద్‌లో సలావుద్దీన్ వారసుడైన అసదుద్దీన్ ఒవైసీకి బీజేపీ అభ్యర్థి మాధవీలత రంగంలోకి దిగారు. ఇంటింటి ప్రచారంతో పాటు సోషల్ మీడియాలో దూకుడు పెంచుతూ తన సత్తా ఏంటో చూపిస్తున్నారు. కచ్చితంగా హైదరాబాద్ స్థానంలో గెలుస్తానంటూ ఆమె ధీమా వ్యక్తం చేస్తోంది. ఆమె ధైర్యం, వాగ్ధాటికి మెచ్చి బీజేపీ అధినాయకత్వం సైతం ఆమె కోసం దిగొచ్చింది. ఆమె గెలుపు కోసం పార్టీ కూడా తీవ్రంగా కృషి చేస్తోంది. నియోజకవర్గంలో ఆలె నరేంద్రకు వారసురాలిగా చెబుతూ చర్చ జరగుతోంది.