20 May, 2026 | 1:48 PM

మందుల షాపులు బందు

20-05-2026 12:37 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): కార్పొరేట్ సంస్థల అధిక డిస్కంట్లు నియంత్రించాలని, ఆన్ లైన్లో మందుల విక్రయాలు నిలిపివేయాలని, నకిలీ మందుల అమ్మకాలు నిలిపివేయాలనే డిమాండ్లతో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు బుధవారం మెడికల్ షాపుల బందు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. మెడికల్ షాపులు మూసివేసి నిర్వాహకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.