20 May, 2026 | 1:35 PM

మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతల స్వీకరణ

20-05-2026 12:34 PM

బోథ్,(విజయక్రాంతి): బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా మల్లెపూల సత్యనారాయణ బుధవారం బాధ్యతలు చేపట్టారు. మార్కెట్ కమిటీ కార్యదర్శి విట్టల్ చైర్మన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన తోపాటు వైస్ చైర్మన్ మోహన్ రెడ్డి డైరెక్టర్ల ను మార్కెట్ కమిటీ కార్యాలయం కార్యదర్శి శాలువాలతో సన్మానించి స్వాగతించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో పదవీ బాధ్యతలు ప్రభుత్వం కట్టబెట్టిందని రైతుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానన్నారు కార్యక్రమంలో పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు