24 August, 2026 | 10:42 PM

Breaking News

ఏకగ్రీవంగా ట్రాక్టర్ల డ్రైవర్ యూనియన్ ఏకగ్రీవం   •   నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి   •   కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •  

నేరేడ్‌మెట్‌లో డ్రగ్స్ స్వాధీనం.. ఇద్దరు అరెస్టు

17-01-2025 02:56 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): నేరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ స్వాధీనం చేసుకుని ఇద్దురు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు(Rachakonda CP Sudheer Babu) పేర్కొన్నారు. ఈ సందర్భంగా  రాచకొండ కమిషనరేట్(Rachakonda Commissionerate)లో సీపీ సుధీర్ బాబు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. రాజస్థాన్ కు చెందిన మహేస్, మహిపాల్  అదుపులోకి తీసుకుని తనిఖీ చేసి 200 గ్రాముల హెరాయిన్, బైక్, మొబైల్స్ సహా ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నిందితులు రాజస్థాన్ కు చెందిన శంషుద్దీన్ నుంచి డ్రగ్స్ కొనిగోలు చేస్తున్నారు. వీటి విలువ దాదాపుగా 23 నుంచి 25 లక్షల వరకు ఉంటుందన్నారు.  2024 నుంచి రాచకొండ పరిధిలో సుమారు రూ.88 కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్ చేసినట్లు సీపీ సుధీర్ బాబు వెల్లడించారు.