16 July, 2026 | 12:48 PM

చెంచు మహిళను నిమ్స్ కు తరలింపు

23-06-2024 10:05 PM

నాగర్ కర్నూల్ : జిల్లాలోని కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లిలో ఆదివాసి మహిళ ఈశ్వరమ్మపై పాశవిక దాడి జరిగిన విషయం తెలిసిందే. జిల్లా జనరల్ దవాఖానలో చికిత్స పోందుతున్న మహిళకు ఆదివారం ఫిట్స్ వచ్చింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ లోని  నిమ్స్ కు తరలించారు. ఇటీవల చెంచు మహిళను ఇసుక వ్యాపారులు దారుణంగా హింసించారు. శరీరంపై కాల్చి, వాతలు పెట్టి, కళ్లు, జననాంగాల్లో కారం పోసి చిత్రహింసలకు గురిచేశారు.