11 July, 2026 | 1:55 AM

సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు డ్రైడే.. ఫ్రైడే..

11-07-2026 12:09 AM

చిన్నంబావి, జూలై 10: మండల పరిధిలోని గూడెం గ్రామంలో శుక్రవారం ఆరోగ్య కార్యకర్తలతో కలిసి సర్పంచ్ వెంకట్ రెడ్డి డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తుల పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు.  ఇంటింటికి తిరుగుతూ ఇళ్ల వద్ద  చెత్త నిలువ  ఉండరాదని,పనికిరాని వస్తువులు, పాడైపోయిన  వస్తువుల్లో నిల్వ ఉన్న పారబోయాలని లేనియెడల దోమలు అధికంగా వ్యాపించే అవకాశం ఉందని దోమల వల్ల విష జరాల్లో వ్యాప్తి చెందుతాయని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ విక్రమ్ యాదవ్,  ఈశ్వరమ్మ, శాంతయ్య, పెద్దనాగశేసీ తదితరులు పాల్గొన్నారు.

డెంగ్యూ, మలేరియా నివారణపై అవగాహన

అలంపూర్, జూలై 10: జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం 7వ వార్డు జమ్ములమడుగు కాలనీలో మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం నిర్వహించారు.డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణకు ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.

శాంతినగర్ నుంచి వడ్డేపల్లి వరకు ప్ర ధాన డ్రెయిన్ను జేసీబీతో శుభ్రం చేసి బ్లీచిం గ్ పౌడర్ చల్లించారు. అలాగే గృహ కంపో స్టి్ంప అవగాహన కల్పించడంతో పాటు జూ లై 13న నిర్వహించే జాతీయ డీవార్మింగ్ కా ర్యక్రమంలో 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరూ నులిపురుగుల నిర్మూలన మాత్రలు తీసుకోవాలని ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ విజయభాస్కర్, మున్సిపల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వార్డు అధికారులు తదితలు పాల్గొన్నారు.