డీఎస్సీ షెడ్యూల్ విడుదల
- జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు
- రోజుకు రెండు షిఫ్టుల్లో ఎగ్జామ్స్
హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): డీఎస్సీ పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను విద్యాశాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసింది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో పరీక్షలను నిర్వహించనున్నారు. జూలై 18న మొ దటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. సెకండ్ షిఫ్ట్ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష జరగనుంది. జూలై 19న సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష, 20న ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ స్పెష ల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. 22న స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష, 23న ఎస్జీటీ పరీక్ష, జూలై 24న స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్స్, 26న తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష, 30న స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్షను నిర్వహించనున్నారు.
31న మొదటి షిఫ్ట్‌లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్, రెండో షిప్ట్‌లో స్కూల్ అసి స్టెంట్ మ్యాథ్స్, ఆగస్టు 1న మొదటి షిఫ్ట్‌లో ఎస్జీటీ, రెండో షిఫ్ట్‌లో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, ఆగస్టు 2న లాంగ్వేజ్ పండిట్ తెలుగు, హిందీ, కన్నడ, మరాఠి, సంస్కృతి, ఉర్దూతోపాటు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష జరగనుంది. ఆగస్టు 5న స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, లాంగ్వేజ్ పండిట్ హిందీ పరీక్ష జరగనుంది. ఫిబ్రవరిలో విడుదల చేసిన తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం జూ లై 17 నుంచి 31 వరకు అని ప్రకటించారు. ఈ షెడ్యూల్‌లో కాస్త మార్పులు చేసి తాజా గా తేదీలు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈనెల 20 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీ కరించగా 2.79 లక్షల దరఖాస్తులు వ చ్చాయి. 11,062 పోస్టులకు దాదాపు 2 లక్ష ల మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.






