5 March, 2026 | 10:20 AM

పాత పెన్షన్ కోసం 2003 డీఎస్సీ ఉపాధ్యాయుల పోరుబాట

05-03-2026 12:54 AM

మహబూబాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): పాత పెన్షన్ విధానం అమలు కోసం 2003 డీఎస్సీ ద్వారా నియమితులైన ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు. 2003 డిఎస్సి నియామక నోటిఫికేషన్ లో లేదు.. నియామక పత్రంలో లేదు,

దాదాపుగా 20 నెలలు సర్వీస్ నిబంధనలు లేక రిక్రూట్మెంట్ లేటు దానితో పాటు న్యూ పెన్షన్ సిస్టం లోకి నెట్టివేయడం చాలా అన్యాయం అంటూ తమకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటూ ప్రత్యక్ష పోరుకు 2003 డిఎస్సి ఉపాధ్యాయులు సన్నద్ధమవుతున్నట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా 2003 డిఎస్సీ సోషల్ మీడియా కన్వీనర్ టిఎస్ యుటిఎఫ్ హన్మకొండ జిల్లా కార్యదర్శి చుంచుకాల లింగారావు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం 57/4,57/5 మెమోల ద్వారా 2004 సెప్టెంబర్ 1 కంటే ముందు నోటిఫికేషన్ ఇచ్చి నియమించబడిన ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుందని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆ మెమోలను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు వర్తింప చేయడం లేదన్నారు. రాష్ట్ర హైకోర్టు డిసెంబర్ 2025 లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోలను వర్తింపజేయాలని తీర్పు ఇచ్చినప్పటికీ అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు.

సిపిఎస్ లేని కాలంలో నియమించబడాల్సి ఉన్నప్పటికీ బాధితులుగా మిగిలిపోయినం, న్యాయంగా పొందాల్సిన పాత పెన్షన్ అమలు దిశగా ప్రభుత్వం కదలాలంటే మార్చి 7న తలపెట్టిన చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభవిజయవంతం చేయడానికి వేలాదిగా తమ కుటుంబాలతో ఉద్యోగులు ఉపాధ్యాయులు తరలి రావాలని కోరారు.