5 March, 2026 | 8:52 AM

టీఎన్జీవోల ఆధ్వర్యంలో హోలీ సంబరాలు

05-03-2026 12:53 AM

ముకరంపుర, మార్చి 4 (విజయక్రాంతి): జిల్లా టీఎన్జీవోల అధ్యక్షుడు, ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం ఆధ్వర్యంలో హోలీ సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులతో కలిసి రంగులు చల్లుకుంటూ, నృత్యాలు చేస్తూ, అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ నివాసానికి వెళ్లి వారికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంగేం లక్ష్మణరావు,  అసోసియేట్ అధ్యక్షులు ఒంటెల రవీందర్ రెడ్డి, జిల్లా కోశాధికారి ముప్పిడి కిరణ్ కుమార్, నాయకులు గూడ ప్రభాకర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, సర్దార్ హర్మీందర్ సింగ్,  మారుపాక రాజేష్ భరద్వాజ్, వెలిచాల సుమంతరావు, కోడూరి వాస్తవిక్ గౌడ్, కొమ్మేర శ్రీనివాస్ రెడ్డి, పోలు కిషన్, కోట రామస్వామి, శంకర్, రమేష్ గౌడ్, ప్రసాద్ రెడ్డి, ఎవి రాజేశ్వరరావు, నగేష్ గౌడ్, బైరి శ్రీనివాస్, కోటేశ్వర, అల్లే శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.