16 June, 2026 | 1:22 AM

ప్రైవేట్ పాఠశాల బస్సులపై డీటీఓ ఆకస్మిక తనిఖీలు

16-06-2026 12:41 AM

ఒక బస్సు సీజ్

గద్వాల టౌన్ జూన్ 15: విద్యార్థువిల భద్రతను దృష్టిలో ఉంచుకుని గద్వాల పట్టణం, మండల పరిధిలోని పలు ప్రైవేట్ పాఠశాలల బస్సులను జిల్లా రవాణా అధికారి రాధిక సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సుల్లో విద్యార్థుల భద్రతకు సంబంధించిన ప్రమాణాలను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ఎమర్జెన్సీ డోర్లు, ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు, అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉన్నాయా భద్రతా నిబంధనలు సక్రమంగా అమలవుతున్నాయా అనే అంశాలను పరిశీలించారు.

విద్యార్థులతో నేరుగా మాట్లాడి బస్సుల్లో ఉన్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.అదేవిధంగా వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్లు,అనుమతి పత్రాలు,బీమా తదితర రవాణా సంబంధిత పత్రాలను తనిఖీ చేశారు.ఈ తనిఖీల్లో అవసరమైన పత్రాలు లేని ఒక ప్రైవేట్ పాఠశాల బస్సును సీజ్ చేసినట్లు డీటీఓ రాధిక తెలిపారు.విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని ఆమె హెచ్చరించారు.అన్ని పాఠశాల యాజమాన్యాలు రవాణా శాఖ నిబంధనలను తప్పనిసరిగా పాటించి విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.ఈ తనిఖీ కార్యక్రమంలో కానిస్టేబుల్ గోవర్ధన్తో పాటు హోంగార్డులు ఋషి,గోవింద్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.