6 June, 2026 | 2:21 AM

బాధ్యతలు స్వీకరించిన డీటీఓ వెంకన్న

06-06-2026 01:16 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూన్ 5, (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి (డిటిఓ)గా బదిలీపై వచ్చిన వెంకన్న బాధ్యతలు స్వీకరించిన తర్వాత, శుక్రవారం కలెక్టర్ రాహుల్ శర్మను ఐడిఓసి కార్యాలయంలో కలిసి మొక్కను అందజేశారు.

భూపాలపల్లి డీటీవోగా విధులు నిర్వహిస్తున్న మహమ్మద్ సంధాని జగిత్యాలకు బదిలీ కాగా, ఆయన స్థానంలో జగిత్యాల నుంచి వెంకన్నను భూపాలపల్లి జిల్లాకు నియమించారు. ములుగు జిల్లా నుండి బదిలీపై వచ్చిన ఎంవిఐ శ్రీనివాస్ కూడా జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంవిఐ  సుందర్ లాల్  పాల్గొన్నారు.