దుబాయ్ సిగలో మరో ముత్యం

30-04-2024 12:05:00 AM

దుబాయ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయ నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నట్టు ‘విజయక్రాంతి’ పత్రికలో చదివి తెలుసుకున్నాం. నమ్మశక్యం కాని రీతిలో మొత్తం 400 ఎయిర్‌క్రాఫ్ట్స్ గేట్లు, 5 రన్‌వేలతో, ఇప్పటి విమానాశ్రయం కన్నా అయిదు రెట్లు పెద్దగా నిర్మించాలని ప్రణాళికలు  రచించడం ఆసక్తికరం. ఏడాదికి సుమారు 26 కోట్ల మంది ప్రయాణికులు పర్యటిస్తారు కనుకే, అంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నట్టున్నారు. దీనికిగాను మొత్తం రూ.3 లక్షల కోట్లు వ్యయం కాగలదని అంటున్నారు.   

జి.నరసింహమూర్తి  నాచారం, హైదరాబాద్