క్రికెట్ బెట్టింగ్‌లను ఆపలేమా?

30-04-2024 12:10:00 AM

తాజాగా సంగారెడ్డి జిల్లాలో ఒక ఇంజినీరింగ్ విద్యార్థి బెట్టింగ్‌ల బారిన పడి అప్పుల పాలై, చివరకు ఆత్మహత్య చేసుకున్నట్టు వార్త వచ్చింది. అతను రూ. 25 లక్షలు అప్పు చేసి, ఐపీఎల్ మ్యా చ్‌లలో పందెం కాశాడట. ఈ ఒత్తిడిని తట్టుకోలేక చివరికి ఉరేసుకున్నాడు. బెట్టింగ్‌కు సంబంధించి ఆన్‌లైన్ యాప్‌లపై ప్రభుత్వా లు తక్షణం చర్య తీసుకోవాలి. ఇలా ఈతరం యువత ఇంకెంత మంది ఈ బెట్టింగ్ దుర్మార్గాలకు బలికావాలో! పోలీసులు ఎంత గా చర్య తీసుకుంటున్నా మళ్లీ కొత్త యాప్‌లు, వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.


పార్నంది కాశీనాథ్‌శర్మ, నర్మెట