ఉల్లి రైతులకు ఊరట

30-04-2024 12:05:00 AM

అయిదు నెలల కిందట విధించిన ఎగుమతుల నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మహారాష్ట్రలోని ఉల్లి రైతులకు కొంత ఊరట కలిగించింది. ప్రతినెలా సుమారు 48 వేల టన్నుల ఉల్లి నాసిక్ నుంచి ఎగుమతి అవుతుందంటే, ఆ రైతులు ఇన్నాళ్లు నిషేధం వల్ల ఎంత నష్టపోయారో అర్థమవుతుంది. ఎన్నికల సమయం నాటికల్లా దేశీయ మార్కెట్లలో ఉల్లి కొరత ఏర్పడితే, అది ఓటర్లపై పెద్ద ప్రభావమే చూపుతుంది. ఈ భయంతోనో లేక మరే కారణంతోనో మొత్తానికి ప్రభుత్వ నిషేధం వల్ల వినియోగదారులు ఇబ్బందులు పడకుండా వున్నారు. ఇప్పుడు మహారాష్ట్ర రైతులను దృష్టిలో పెట్టుకొనే కేంద్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు.

 కె.రాధాకిషన్, ఆదిలాబాద్