భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న దుద్దిల్ల శ్రీనుబాబు
వరంగల్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ అమ్మవారిని సోమవారం ఉదయం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎంపీకి ఆలయ ధర్మకర్త తొనుపునూరి వీరన్న ఘనస్వాగతం పలికారు. పూజానంతరం ప్రధానార్చకులు భద్రకాళి శేషు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు.
వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ లలో అమ్మవారి చిత్రపటములు ఏర్పాటు చేయుటకు రైల్వే జనరల్ మేనేజరుతో మాట్లాడి అనుమతి ఇప్పించవలసినదిగా ధర్మకర్త వీరన్న ఎంపీకి విజ్ఞప్తి చేశారు. దీనికి స్పందించిన ఎంపీ బలరాం నాయక్ వరంగల్ ఎంపీ కడియం కావ్య కలిసి రైల్వే అధికారులతో మాట్లాడి అనుమతి ఇప్పిస్తానని హామి ఇచ్చారు. అలాగే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన శ్రీనుబాబుకు ఆలయ ధర్మకర్తలు గౌడె శ్రవణ్ కుమార్ రెడ్డి, ఓరుగంటి పూర్ణచందర్, మోత్కూరి మయూరి రామేశ్వర్రావులు స్వాగతం పలికారు. ముందుగా ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ఆలయ మహా మండవంలో అర్చకులు, వేదపండితులు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో వంశీ తదితరులు పాల్గొన్నారు.






