15 June, 2026 | 2:02 PM

Breaking News

ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •   ఆలయంలో గుప్తనిధుల వేట.. ప్రాచీన శివాలయం ధ్వంసం   •   భట్టి విక్రమార్కకు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ   •  

సహజమైన ఆహారం ఆరోగ్యానికి రక్షణ

24-02-2026 12:00 AM

కేయూ వీసి  కె. ప్రతాపరెడ్డి

హనుమకొండ, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): సహజ పోషకాలతో కూడిన సమతుల్య ఆహారం ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుందని కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాపరెడ్డి తెలిపారు. నిత్యం తీసుకునే ఆహారంలో సహజ పద్ధతిలో పండించిన ఉత్పత్తులు భాగం కావాలని సూచించారు. రసాయనాల అధిక వినియోగం ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని ఆయన పేర్కొన్నారు.

అనంతరం కేయూ ఈసీ మెంబర్ అనిత రెడ్డి, ఆరట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు అలవరుచు కోవాలని, సహజ వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

సమాజ ఆరోగ్య పరిరక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని ఆమె తెలిపారు. సోమవారం ఆరట్స్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సహజ ఆహార ఉత్పత్తుల కేంద్రాన్ని ఉపకులపతి ప్రారంభించారు.ఈ కేంద్రంలో సహజ ఉత్పత్తులు 3 రోజులపాటు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో భయ్యా సారయ్య, మిల్లెట్స్ ప్రమోటర్ నిమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.