3 March, 2026 | 11:04 PM

ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి

03-03-2026 12:00 AM

ఇల్లందు టౌన్ మార్చి 2 (విజయక్రాంతి): సింగరేణి సంస్థ ఇల్లందు ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయంలో మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వోటూ జీఎం రామస్వామి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంథిని నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా,

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా సేవలందించిన వారి ప్రజాసేవను కొనియాడారు. రాష్ట్ర రాజకీయాల్లో స్థిరమైన నాయకత్వం ప్రదర్శించిన మహానుభావుడిగా గుర్తుచేశారు. కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) అజ్మీర తుకారాం, డీజీఎం (ఎఫ్ అండ్ ఏ) నాగలక్ష్మి, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.