3 March, 2026 | 9:38 PM

నూతన మసీదును ప్రారంభించిన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు

03-03-2026 12:00 AM

చర్ల, మార్చి 2,( విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని భద్రాచల ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు.  మండలం పరిధిలోని లింగాపురం పాడు  గ్రామంలో నూతన మసీదు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీలకు ఎంతో ప్రాధాన్యత కల్పిస్తుందని రాజకీయంగా పదవులను కూడా కల్పిస్తూ మంత్రి పదవులను కూడా ఇస్తూ రిజర్వేషన్ కల్పించింది,  విద్యార్థులు చదువుకోవడానికి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసింది.

విదేశాలలో వెళ్లి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందిస్తూ వారి చదువుకు సహకరిస్తుందన్నారు. రంజాన్ పండుగకు ప్రభుత్వం తరఫున కానుకలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అల్లా దయతో దేవుని పట్ల ప్రతి ఒక్కరూ భక్తి భావంతో ప్రతిరోజు నమాజ్ చేయడం వల్ల మనలోని చెడు ఆలోచనలు తొలిగిపోతాయన్నారు.

గ్రామంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి ఐక్యతతో గ్రామాభివృద్ధిలో కూడా పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో లింగాపురం సర్పంచ్ గుగులోత్ మంగ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండారు రామకృష్ణ, చీమలమర్రి మురళి, పోలిన రాజు లింగాపురం పాడు ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు,