calender_icon.png 4 February, 2026 | 2:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలస్యం వల్లే రెండు వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు

04-02-2026 12:11:06 AM

  1. చేజార్చుకున్న కాంగ్రెస్....

బి ఫామ్ లు ఇచ్చిన ఫలితం శూన్యం...

బి ఫామ్ ల అందచేతలో భగ్గుమన్న అభ్యర్థులు

రాజకీయ కుట్రలో భాగమే బి ఫామ్ ఆలస్యం.... కదిరే రాములు, 25 వ వార్డు అభ్యర్థి 

జంపింగ్ లకు ప్రధాన పాత్ర కల్పించిన పార్టీ పెద్దలు..... సమద్, 19 వార్డు అభ్యర్థి

దళితులకు త్రీవ అన్యాయం జరిగింది ... వెంకటేష్, 21 వ వార్డు అభ్యర్థి

వనపర్తి, ఫిబ్రవరి 03 ( విజయక్రాంతి ) : సంవత్సర కాలం నుండి ఎదురు చూస్తున్న మున్సిపాలిటీ ఎన్నికలకు సంబందించి నోటిఫికేషన్ నామినేషన్ ప్రక్రియ వంటి కార్యక్ర మాలు పూర్తి అయ్యాయి. ఇప్పటికే అటు బి ఆర్ ఎస్ ఇటు బీజేపీ పార్టీలు అభ్యర్థులను ప్రకటన చేయడం తో పాటు బి ఫామ్ లను సైతం పంపిణి చేశారు. కాంగ్రెస్ పార్టీ తరుపున ఫోటి చేయాలనుకునే వారందరు సై తం కాంగ్రెస్ పార్టీ తరుపున నామినేషన్లు వే యడం జరిగింది.

సర్వే ల ప్రకారమే పార్టీ తరుపున బి ఫామ్ లను ఇస్తామని చెప్పడం తో ఆశావాహులు ఎదురు చూసారు. కానీ పార్టీ టికెట్ కు సంబందించిన బి ఫామ్ ల ప్రక్రియ మంగళవారం జిల్లా కేంద్రం లోని డిసిసి కార్యాలయం లో రాష్ట్ర ప్రణాళిక సం ఘం ఉపాధ్యక్షలు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మే ఘా రెడ్డి, డిసిసి అధ్యక్షులు శివ సేనా రెడ్డి లు అభ్యర్థులకు నామినేషన్లను ఇచ్చారు.  

ఆలస్యం వల్లే రెండు వార్డు లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరు 

కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేయడం తో ఎవరికీ ఇవ్వాలి వంటి చర్చలతో పార్టీ బి ఫామ్ ల ను అందచేసే సమయానికి 5 నిముషాల ముందు ఇవ్వడం వల్ల జిల్లా కేంద్రం లోని 25 వ, 7 వ వార్డు ల తరుపున బి ఫామ్ ల ను ఇచ్చినప్పటికి సమయం అయిపోవడం తో అభ్యర్థులను మున్సిపాలిటీ లోపలికి అ నుమతించక పోవడంతో వారు నిరసన ను వ్యక్తం చేశారు.

ఆలస్యం కావడం వల్ల అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా రెండు వార్డు లకు సంబందించి పార్టీ బి ఫామ్ లు అందక పో వడంతో కాంగ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థులు లేకుండా పోయారు. దింతో బి ఫామ్ లు ఇ చ్చిన ఫలితం మాత్రం శూన్యంగా మా రింది. అభ్యర్థులు ఉన్న కూడా వార్డు ఫోటీ లో కాం గ్రెస్ పార్టీ తరుపున అభ్యర్థులు లేకపోవడం వల్ల చెజేతుల కాంగ్రెస్ చేజార్చుకున్నదని రా జకీయ విశ్లేషకులుఅభిప్రాయపడుతున్నారు. 

 రాజకీయ కుట్రలో భాగమే బి ఫామ్ ఆలస్యం.... కదిరే రాములు, 25 వ వార్డు అభ్యర్థి 

తాను 25 వ వార్డు తరుపున ఫోటి లో ఉన్నానని ఇప్పటికే తాను నామినేషన్ వేసినప్పటికి కూడా తనకు పార్టీ నుండి బి ఫామ్ ఇవ్వడానికి మంగళవారం మధ్యాహ్నం 2. 55 గంటల వరకు కావాలని బి ఫామ్ ఇవ్వకుండా ఆపి చివరి నిమిషం లో ఇవ్వడం తాను మున్సిపాలిటీ కి చేరుకునే వరకు సమయం అయిపోయిందని 25 వ వార్డు అభ్యర్థి కదిరే రాములు అన్నారు.

తనకు బి ఫామ్ ఇవ్వడానికి ఇష్టం లేకనే సమయం అయిపోతుంటే ఇచ్చారని ఇదంతా రాజకీయ కుట్రలో భాగమన్నారు. తాను మెదటి నుండి కాంగ్రెస్ పార్టీ లోనె ఉన్నానని స్వతం త్రి అభ్యర్థి గా ఫోటి చేసి తమ సత్తా ఏమిటో కాంగ్రెస్ పార్టీకి చూపుతానన్నారు. 

 జంపింగ్ లకు ప్రధాన పాత్ర కల్పించిన పార్టీ పెద్దలు..... 19 వార్డు అభ్యర్థి సమద్ 

పార్టీని నమ్ముకుని తరతరులుగా పని చే స్తున్న కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో న్యా యం లేదని కేవలం ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీల్లో జంపింగ్ అయిన అభ్యర్థులకు ప్రధాన పాత్ర ను పార్టీ పెద్దలు కల్పించి పార్టీ బి ఫామ్ లు ఇవ్వడం దారుణమని 19 వ వార్డు అభ్యర్థి సమద్ అన్నారు. పార్టీకి ప ని చేసే వాళ్లు కన్నా ఇటీవల అయిన జంపిం గ్ లకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం ఉందన్నారు. 

 దళితులకు త్రీవ అన్యాయం జరిగింది ... 21 వ వార్డు అభ్యర్థి వెంకటేష్ 

పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన దళితులకు త్రీవ అన్యాయం చేసారని 21 వ వా ర్డు అభ్యర్థి వెంకటేష్ తన ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో ముగ్గురు పిల్లలు అనే ని బంధన ఉండడం వల్ల ఫోటి చేయలేదని ప్ర స్తుతం ఆ నిబంధన తీసివేయడం తో కాంగ్రె స్ పార్టీ తరుపున నామినేషన్ వేయడం జరిగింది. జనరల్ సీట్ రావడం వల్ల తమకు అవకాశం ఇవ్వకుండా తమకు సర్వేలో ఫలితం ఉన్నప్పటికీ కూడా తమకు ఇవ్వకుం డా వార్డు కు సంబంధం లేని వారికీ టికెట్ ఇవ్వడం దారుణమన్నారు.