04-02-2026 12:10:12 AM
టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్
మెదక్, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రైతులకు క్షేత్రస్థాయిలో సేవలు అందించడంలో వ్యవసాయ విస్తరణ అధికారులకు అదనపు సౌకర్యాలు కల్పించాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షులు దొంత నరేందర్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో విస్తరణ అధికారుల సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్ కుమార్ తో కలిసి మాట్లాడారు. రైతు వేదిక నిర్వహణకు సంబంధించి వెచ్చించిన బిల్లులు, వేదిక నిర్వహణకు సహాయకులను నియమించే విధంగా జిల్లా అధికారులు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాలని కోరారు.
అనంతరం జిల్లా కార్యదర్శి మినికె రాజ్ కుమార్ తో కలిసి ఆ సంఘం డైరీ క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మినిస్ట్రియల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి, టీజీవో జిల్లా అధ్యక్షులు విటల్, అధికారులు విన్సెంట్ వినయ్ కుమార్, రుద్ర మూర్తి, టిఎన్జీవో జిల్లా సహా అధ్యక్షులు ఇక్బాల్ పాష, ఉపాధ్యక్షులు రఘునాథరావు, ఏ ఈ ఓల ఫోరం అధ్యక్ష కార్యదర్శులు ప్రశాంత్, రాజశేఖర్, నరేందర్ గౌడ్, మాధవి, తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.