16 March, 2026 | 9:55 PM

Breaking News

9వ డివిజన్ మేడిపల్లి కాలనీల సమస్యలను వెంటనే పరిష్కరించాలి   •   ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దురాక్రమణ దాడి ఆపాలి   •   కరీంనగర్ రూరల్ తహశీల్దార్‌ను కలిసిన టీఎన్జీవో, టిజీవో నాయకులు   •   విద్యార్థుల స్కాలర్షిప్ & ఫిజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి   •   ఎమ్మెల్యే మందుల సామేలు ఇంటి ముట్టడి.. గుడ్లు, టమాటలతో దాడి   •   రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి   •   సమస్య విన్నారు.. పరిష్కారానికి హామీ ఇచ్చారు   •   ప్రాణాపాయ స్థితిలో ఉన్న జీవం పోసిన పశువైద్యాధికారి   •   దోమకొండకు నిధులు మంజూరు   •   అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి అండగా నిలిచిన ప్రభుత్వ విప్   •  

యాదాద్రి సన్నిధిలో దసరా ఉత్సవాలు

10-10-2024 03:04 PM

యాదాద్రి భువనగిరి (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్య క్షేత్రం యాదాద్రి అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు గురువారం దుర్గాదేవీ అలంకారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. ప్రాతఃకాల పూజ అర్చనలు పారాయణములు గాయత్రీ జపములు లలిత సహస్రనామార్చన దుర్గాష్టమి పురస్కరించుకొని విశేషంగా చండీ హవనం జరిగినది. మధ్యాహ్న పూజ నీరాజన మంత్రపుష్పములు తీర్థప్రసాద వితరణ జరిగినది. సాయంకాలం శ్రీదేవీ నవావరణ పూజ సహస్రనామార్చన నీరాజనం మంత్రపుష్పములు దుర్గా స్వరూప సువాసినీ పూజ  పూజ తీర్థ ప్రసాద వితరణ జరుగును.