19 May, 2026 | 10:54 AM

ద్వాదశ రాశిఫలాలు

25-08-2024 01:41 AM

25.-8.-2024 నుండి 31.-8-.2024 వరకు

రామడుగు రంగన్న సిద్ధాంతి :

మేషం

ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి శుభంగా ఉంది. -ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. బంధుమిత్రులవల్ల సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు అనుకున్న ఉద్యోగాలు, మంచి సంబంధాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ధనలాభం, ప్రమోషన్లు కలుగుతాయి. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. రైతులు ఆనందంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 80 శాతం అనుకూలత, 20 శాతం ప్రతికూలత ఉంది. 

వృషభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగం, పెండ్లి విషయాలో జాప్యం జరుగుతుంది. ఉద్యోగస్తులకు ఊహించని ఖర్చులు ఏర్పడతాయి. ఒత్తిళ్లు పెరుగుతాయి. వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చికాకుగా ఉంటారు. విదేశీ ప్రయత్నాలు ఫలించవు. రైతులకు లాభాలు ఉండవు.- ఆరోగ్య విషయాలో జాగ్రత్త ఉండాలి.- మొత్తం మీద ఈ రాశివారికి 25 శాతం అనుకూలత, 75 శాతం ప్రతికూలత ఉంది.

మిథునం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. చేసే పనులు ఆలస్యంగా ఫలిస్తాయి. పోయిన ధనం తిరిగి వస్తుంది. బంధుమిత్రులతో స్పర్ధలు ఏర్పడుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులు చదువులలో ముందుంటారు. వ్యాపారస్తులకు, రైతులకు చేసే పనులలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

కర్కాటకం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. శుభ కార్యక్రమాలు చేస్తారు. యువతీ యువకులకు ఉద్యోగాలు లభిస్తాయి. అనుకున్న వారితో వివాహాలు కుదురుతాయి. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది. 

సింహం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఆత్మీయులతో మంచిగా ఉంటారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులలో పట్టుదల అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు ముందుచూపు ఉండాలి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశివారికి 30 శాతం అనుకూలత, 70 శాతం ప్రతికూలత ఉంది.

కన్య

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు. బంధువులతో సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు కోరుకున్న వారితో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. ఉద్యోగాలు లభిస్తాయి. విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు, రైతులకు సంతోషం కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది. 

తుల

-ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. బంధువులతో స్పర్ధలు కలుగుతాయి. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడుతాయి. యువతీ యువకులకు వివాహ, ఉద్యోగ విషయాలలో స్తబ్దత ఉంటుంది. విద్యార్థులు శ్రమించవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. వ్యాపారస్తులకు, రైతులకు ప్రతికూల కాలం. మొత్తం మీద ఈ రాశివారికి 30 శాతం అనుకూలత, 70 శాతం ప్రతికూలత ఉంది. 

వృశ్చికం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మిశ్రమంగా ఉంది. ఆరోగ్య విషయమై చాలా జాగ్రత్త ఉండాలి. ధనవ్యయం అవుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. యువతీ యువకులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులలో పురోగతి ఉంటుంది. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. పెద్దవారితో పరిచయాలు ఏర్పడుతాయి. శుభవార్తలు వింటారు. బంధువులతో సంతోషంగా ఉంటారు. యువతీ యువకులకు మంచివారితో వివాహం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 70 శాతం అనుకూలత, 30 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో జాప్యం జరుగుతుంది. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం లభిస్తుంది. -విద్యార్థులకు చదువులలో శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉన్నది.

కుంభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. తొందరపాటుతనం పనికిరాదు. మిత్రులతో విరోధం కలుగుతుంది. ధనవ్యయం అవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులకు శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులు, రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది. 

మీనం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. అనుకోని ఖర్చులవుతాయి. బంధువులతో భేదాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. శుభ కార్యాలు చేస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులకు చదువులలో పట్టుదల, ఉత్సాహం అవసరం. వ్యాపారస్తులు, రైతులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు అనారోగ్యానికి గురవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది.