తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా
- 35 రోజులుగా యశోద హాస్పిటల్‌లో చికిత్స
- పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి, కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 24 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ సీనియర్ నేత జిట్టా బాల కృష్ణారెడ్డి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ 35 రోజులుగా యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ శనివారం బాలకృష్ణారెడ్డిని పరామర్శించారు. చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని కోరారు. త్వరగానే కోలుకుంటారని వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాస్పిటల్ వెళ్లి బాలకృష్ణారెడ్డి పరామర్శించారు. ఆయన సతీమణి సునీతకు మనోధైర్యం చెప్పారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం హాస్పిటల్‌కు వెళ్లి జిట్లా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకునేలా వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.






