17 April, 2026 | 12:33 PM

కాంగ్రెస్ పార్టీపై సన్నగిల్లుతున్న నమ్మకం

26-06-2025 12:00 AM

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ 

ఆదిలాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీపై రోజురోజుకు ప్రజలతో పాటు ఆ పార్టీలో ఉన్న నేతలకు సైతం నమ్మ కం సన్నగిల్లుతోందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలంలోని రుయ్యా డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సెర్ల పొచ్చన్న బుధవారం బోథ్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరా రు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాధవ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ అంటే మన తెలం గాణ ఇంటి పార్టీ అని అన్నారు. ఎలాంటి కష్టం వచ్చినా మీకు అనిల్ జాధవ్ ఉన్నాడని మర్చిపోవద్దని ధీమా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.