15 June, 2026 | 7:57 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలి: డివైఎఫ్ఐ

03-02-2026 04:24 PM

హనుమకొండ,(విజయక్రాంతి): గంజాయి స్మగ్లర్ల దాస్టికానికి అసువులు బాసిన నిజామాబాద్ ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని డివైఎఫ్ఐ హనుమకొండ  జిల్లా కార్యదర్శి డి.తిరుపతి డిమాండ్ చేశారు. కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ హనుమకొండ నక్కల గుట్టలోని కాలోజి విగ్రహం దగ్గర  డివైఎఫ్ఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ... జనవరి 23న గంజాయి సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు నిజామాబాద్ శివారులోని మాధవ నగర్ వద్ద ఎక్సైజ్ పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా ఎక్సైజ్ పోలీసులను చూసిన గంజాయి స్మగ్లింగ్ ముఠా సభ్యులు పారిపోయేందుకు ప్రయత్నించగా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య వారిని పట్టుకునే ప్రయత్నంలో గంజాయి ముఠా సభ్యుల తమ కారుతో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ఢీకొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారని ఎనిమిది రోజులపాటు సౌమ్య ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి విధి నిర్వహణలో అసాధారణ తెగువ ప్రదర్శించి అసువులు బాసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

పోలీసులకే రక్షణ లేనప్పుడు  సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, రాష్ట్రంలోని చత్తీస్గడ్, మహారాష్ట్రకు సంబంధించిన గంజాయి డ్రగ్స్ స్మగ్లర్లు తెలంగాణలోకి ప్రవేశిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఇప్పటివరకు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అన్నారు .తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా సిటీ  నుండి గ్రామాల వరకు  విస్తరించిందని రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు నీఘా పెట్టాలని,రెండు నెలల క్రితం చర్లపల్లి లో కెమికల్ కంపెనీ పేరుతో డ్రగ్స్ ను తయారు చేస్తూ విదేశాలకు పంపిస్తున్న పరిస్థితి ఉందని ఆయన గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ గంజాయి పై స్పెషల్ వింగ్లను ఏర్పాటు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలనీ,వెంటనే కానిస్టేబుల్ సౌమ్య మృతికి కారణమైన గంజాయి స్మగ్లర్లను కఠినంగా శిక్షించాలని సౌమ్య కుటుంబాన్ని అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని   డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు కే.కుమార స్వామి , యం.సతీష్ , డివైఎఫ్ఐ నాయకులు జి.గణేష్, కే.మహేందర్,రాజు పాల్గొన్నారు.