17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

కార్పొరేటర్ల కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా ఖరారు

03-02-2026 04:29 PM

సుదీర్ఘ చర్చల అనంతరం విడుదల చేసిన డిసిసి జిల్లా అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): మహబూబ్ నగర్ తొలి కార్పోరేషన్ ఎన్నికలు జరగనుండడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను డిసిసి అధ్యక్షులు సంజీవ ముదిరాజ్ విడుదల చేశారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల అధికారులకు బీఫాంలో అందజేయడంతో ఆ సమయంలోపే జాబితా విడుదల చేసి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది.

ఈ సందర్భంగా డిసిసి జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ... పార్టీ ప్రతి ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందని, ఎవరు దిగులు చెందకూడదని స్పష్టం చేశారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండి పనిచేసిన ప్రతి కార్యకర్తకు మంచి జరుగుతుందని తెలిపారు. ఎవరు కూడా టికెట్ రాలేదని ఆవేదన చెందకూడదని వారికి భవిష్యత్తులో మరింత మంచి పదవులు దక్కి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. 60 మంది కి 60 కార్పొటర్ల ను గెలిపించుకోవాలని సూచించారు.  సోమవారం 36 మంది అభ్యర్థులను ఖరారు  చేసినప్పటికి మంగళవారం 24 మంది తుది జాబితా ను విడుదల చేసింది.