23 April, 2026 | 3:34 AM

జాతీయ రెజ్లింగ్ క్రీడాకారుడిని పరామర్శించిన డి.వై.ఎస్.ఓ.

23-04-2026 01:50 AM

కొత్తగూడెం, ఏప్రిల్ 22, (విజయక్రాంతి ): గత నెల చత్తీస్గడ్ రాష్ట్రంలో జరిగిన కేలో ఇండియా ట్రైబల్స్ జాతీయస్థాయి రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో ,క్వార్టర్ ఫైనల్ రౌండ్ నందు మ్యాచ్ లో తలపడుతున్న వెంకట ప్రసాద్ కు కాలు మణికట్టు వద్ద ప్యాక్చర్ అవడంతో ,ఛత్తీస్గడ్ రాష్ట్రం రాయపూర్ లో శాస్త్ర చికిత్స పూర్తి చేసుకుని తన ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న  వెంకటప్రసాద్ ను , బుధవారం జిల్లా క్రీడాఅధికారి  పరందామ రెడ్డి ప్రసాద్ ఇంటికి వెళ్లి పరామర్శించారు .

శస్త్ర చికిత్స కు సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు .ఈ సందర్భంగా పరంధామ రెడ్డి మాట్లాడుతూ, వెంకటప్రసాద్ ఎంతో ప్రతిభవంతుడైన రెజ్లింగ్ క్రీడాకారుడు అని, ఇటీవల గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ ,ఢిల్లీలో, జరిగిన పలు జాతీయస్థాయి పోటీలలో ఎంతో ప్రతిభ కనబరిచి ఇటీవల కలెక్టర్ జితేష్ వి పాటిల్ , చేతులమీదుగా ప్రశంస పత్రం అందుకోవడం జరిగిందని ,వెంకట ప్రసాద్ కు జిల్లా స్పోరట్స్ అథారిటీ తరఫున సహాయ సహకారాలు అందిస్తామని ,

త్వరగా కోలుకొని మళ్లీ రెజ్లింగ్ పోటీలలో జిల్లా తరఫున పాల్గొని రాష్ట్ర ,జాతీయ స్థాయి  పోటీలో  సత్తా చాటి పతకాలు గెలుపొంది, జిల్లా కీర్తిని చాటాలని ఆయన ఆశబావం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి :పి. కాశీ హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర టైక్వాండో అసోసియేషన్ ఉపాధ్యక్షులు: ఇ.మొగిలి, అసోసియేషన్ సభ్యులు :ఆదినారాయణ, :జస్వంత్ , :పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.