27 July, 2026 | 5:02 PM

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలి

27-07-2026 04:25 PM

సర్పంచ్ వెంకటమ్మ చంద్రయ్య గౌడ్

గరిడేపల్లి జూలై 27,(విజయ క్రాంతి): ఉపాధి హామీ పథకం పనులను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని గరిడేపల్లి సర్పంచ్ మేకపోతుల వెంకటమ్మ చంద్రయ్య గౌడ్ కోరారు.సోమవారం గరిడేపల్లి గ్రామపంచాయతీలో 2025 -26 సంవత్సరానికి సంబంధించిన ఉపాధి హామీ పనులకు 65 లక్షల రూపాయల పనులపై నిర్వహించిన సోషల్ ఆడిట్ గ్రామ సభలో పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని విబిజి రాంజీగా ఈ పథకం ద్వారా నీటి కుంటలు,  ఇంకుడు గుంతలు, ఫారంపాండ్స్ నీటి నిల్వ పనులకుఅవకాశం కల్పిస్తుంది అన్నారు.

ప్రజలు ఈ పనులను నిర్వహించుకోవచ్చునన్నారు అవసరమైన వారు గ్రామపంచాయతీలో దరఖాస్తులు సమర్పించాలన్నారు గ్రామంలో వస్తున్న పింఛన్ల పైకి కూడా ఆడిట్ నిర్వహించినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఉపాధిహామీ పథకం ద్వారానే ప్రభుత్వం 39 వేల రూపాయలు అందిస్తుంది అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా గ్రామంలో 10 రోజులపాటు నిర్వహించిన ఆడిట్ ఫై ఆడిటర్లు తాము సేకరించిన సమాచారాన్ని గ్రామ సభకు తెలియజేశారు. కార్యక్రమంలో డిఆర్పి సురేష్, ఉపసర్పంచ్ మాతంగి సంజీవ, పంచాయతీ కార్యదర్శి నాగేశ్వరరావు, టి ఏ శిరీష, ఫీల్డ్ అసిస్టెంట్ మేకపోతుల సరిత తో పాటు వార్డ్ మెంబర్లు అంగన్వాడి ఆశ కార్యకర్తలు వివోఏ  లు గ్రామస్తులు లు పాల్గొన్నారు