27 July, 2026 | 4:59 PM

ఎస్‌ఐఆర్ ఫారాల స్వీకరణ వేగవంతం చేయాలి

27-07-2026 04:23 PM

 జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణను వేగవంతం చేసి, గడువులోగా 100 శాతం డిజిటైజేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకున్న ఓటర్లు వాటిని పూర్తిగా నింపి వెంటనే సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బి. ఎల్‌. ఓ లకు) అందజేయాలని కలెక్టర్ సూచించారు. 

ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని ఓటర్ల పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో నమోదు కావని, దీంతో వారు ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. కాబట్టి ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఎన్యూమరేషన్ ఫారాన్ని సకాలంలో సమర్పించి, ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు నమోదయ్యేలా చూసుకోవాలని సూచించారు.ఎస్‌ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, తప్పులు లేకుండా, వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రజలందరూ అధికారులకు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా కోరారు.