calender_icon.png 20 February, 2026 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజా సేవ చేసి గుర్తింపు తెచ్చుకోండి

20-02-2026 01:31:20 AM

నిర్మల్‌ఫిబ్రవరి ౧9 (విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజలకు ప్రజా సేవ చేసి రుణం తీర్చుకోవాలని మాజీ మం త్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ అప్పాల కావ్య, వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి ఇంద్రకరణ్ రెడ్డి కలిసి సన్మానం చేసి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

అలాగే నిర్మల్ పట్టణంలోని కావేరి నగర్‌లో అప్పాల వంశీయుల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్‌గా ఎన్నికైన అప్పలకావ్య గణేష్ దంపతులకు సన్మానం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల అను రాధ, అప్పల కుటుంబ సభ్యులు అప్పల ప్రభాకర్, భోజరాజు చక్రధరి కుటుంబ సభ్యులు ఉన్నారు.