17 August, 2026 | 2:47 AM

51కి పెరిగిన భూకంప మృతుల సంఖ్య

17-08-2026 01:33 AM

జకార్తా, ఆగస్టు 16: ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపంలో మృతుల స ంఖ్య ఆదివారం నాటికి 51కి పెరిగింది. ఐదువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 36 మంది పరిస్థితి విషమంగా ఉందని, 1,300 మందికి గాయాలయ్యాయని, 77 మందికి స్వల్ప గాయాలయ్యాయని, 3,500 మంది రెస్క్యూ చర్యల్లో భద్రతా సిబ్బంది పాల్గొంటు న్నారని డిప్యూటీ ఆరోగ్యశాఖ మంత్రి బెంజమిన్ పాలిస్ ప్రకటించారు. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారని చెప్పారు.

వారిని బయ టికి తీసేందుకు ప్రయత్నిస్తున్నా మన్నారు. 2022 తరువాత ఇదే అత్యంత తీవ్రగల భూక ంపమన్నారు. 7.7 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం అనంతరం రోజంతా 341 ప్రకం పనలు గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది. కాగా ప్రజలు తమ ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లు, ఇళ్ల బయట చెట్లకిందే ఆశ్రయం పొందుతున్నారు. శనివారం ఇండోనేషియాలో ని టెర్నాటే నగరం, ఫ్లోరెస్ ద్వీపంలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.